చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి... కన్నీటిపర్యంతమవుతున్న ఆర్టీసీ కార్మికులు

  • ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన శ్రీనివాసరెడ్డి
  • హైదరాబాదులోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో మృతి
  • శ్రీనివాసరెడ్డి శరీరం 90 శాతం కాలిపోయిందన్న వైద్యులు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో నిన్న ఆత్మాహుతికి యత్నించిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆయన ఆత్మాహుతికి యత్నించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆయనను హైదరాబాదులోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

అయితే, వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదు. ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. ఆయన శరీరం 90 శాతం కాలిపోయిందని తెలిపారు. మరోవైపు, శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారన్న వార్తతో ఆర్టీసీ ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. కన్నీటిపర్యంతం అవుతున్నారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నాయి.
Go Back to Shorts
RTC Driver
Srinivas Reddy
TSRTC
Strike

More Telugu News